అక్రమ భూకబ్జా కేసులో మహబూబాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను డిసెంబర్ 2 వరకు అరెస్ట్ చేయరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే, ఈ తీర్పు.. ఈ వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తుకు ఎలాంటి ఆటంకం కలిగించదని జస్టిస్ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తనను భూకబ్జాలు, అక్రమాస్తుల ఆరోపణల్లో తప్పుగా ఇరికించారని శంకర్ నాయక్ కోర్టులో పిటీషన్ వేశారు.
శంకర్ నాయక్‌పై ప్రభుత్వ ఉపాధ్యాయురాలు జల్లిపల్లి పద్మావతి వరంగల్ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శంకర్ నాయక్ పేరును ఉపయోగించి పలువురు వ్యక్తులు తన ఆస్తిలోకి అక్రమంగా ప్రవేశించారని.. సుమారు రూ. 4 లక్షల విలువైన వస్తువులను దొంగిలించారని ఆమె పేర్కొంది.
లక్చెర్ల ఘటనలో ఇటీవల అరెస్టయిన రైతులకు మద్దతు తెలిపేందుకు మహబూబాబాద్‌లో జరిగిన ఆందోళనలో పాల్గొనకుండా ఉండేందుకు పోలీసులు ఉద్దేశపూర్వకంగానే శంకర్ నాయక్‌పై కేసు నమోదు చేశారని ఆయన తరపు న్యాయవాది వాదించారు.
జస్టిస్ లక్ష్మణ్ ఈ అరెస్టు నుండి శంకర్ నాయక్‌కు తాత్కాలిక ఉపశమనం కల్పించడంతో పాటు ఫిర్యాదుదారు, పోలీసు అధికారులను సమాధానం కోరుతూ నోటీసులు జారీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 2కి వాయిదా పడింది.