తెలంగాణ ఉద్యమకారులకు హైకోర్టు గుడ్‌న్యూస్..పెన్షన్లు, ఇళ్ల స్థలాలపై కీలక ఆదేశాలు

తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది.

By -  Knakam Karthik
Published on : 23 Feb 2026 3:15 PM IST

Telangana HighCourt, Telangana Activists, AbhayaHastham, Congress Guarantees, House Sites, Pensions

తెలంగాణ ఉద్యమకారులకు హైకోర్టు గుడ్‌న్యూస్..పెన్షన్లు, ఇళ్ల స్థలాలపై కీలక ఆదేశాలు

తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఉద్యమ జేఏసీ నాయకులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.

పిటిషనర్ల తరఫు న్యాయవాది జి. కరుణాకర్ రెడ్డి వాదనలు విన్న జస్టిస్ విజయసేన్ రెడ్డి, అభయహస్తం పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఉద్యమకారులందరికీ ఎనిమిది వారాల లోపు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు మంజూరు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు ఫ్రీడమ్ ఫైటర్ శాఖ అధికారులకు గడువు విధించారు.

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లపై కోర్టు సానుకూలంగా స్పందించడంతో ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంపైనే అందరి ఆసక్తి నెలకొంది.

Next Story