టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
తెలంగాణలో ప్రభుత్వ టీచర్లకు రేవంత్‌రెడ్డి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 28 Jun 2024 10:15 AM ISTటీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
తెలంగాణలో ప్రభుత్వ టీచర్లకు రేవంత్‌రెడ్డి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. టీచర్లకు పదోన్నతులు దక్కాయి. గత 20 ఏళ్లుగా ఎస్జీటీలు, భాషాపండితులు, పీఈటీలు ఎదురుచూస్తున్న వారి కలను నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం 18,942 మందికి పదోన్నతులు ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ ప్రక్రియకు ఇబ్బందిగా మారిన చట్టపరమైన వివాదాలను సీఎం రేవంత్‌రెడ్డి పరిష్కరించారు. మల్టీజోన్-1 ప్రభుత్వ, స్థానిక సంస్థలకు సంబంధించి ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ 10,083, స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధానోపాధ్యాయులు 1094 మందికి ప్రమోషన్లు అందించారు. మల్టీజోన్‌లో ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ -6989 , స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధానోపాధ్యాయులుగా 776 మందికి పదోన్నతులు దక్కాయి.
సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే విద్యాశాఖ ఉంది. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుల ప్రమోషన్ల అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. పదోన్నతులు కల్పించారు. అంతేకాదు.. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలపోవడంతో పదోన్నతులకు కూడా గ్రీన్ సిగ్నలు ఇచ్చినట్లు అయ్యింది. ఈ ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు మంచి జరుగుతోంది. గురువారంతో ప్రమోషన్ల ప్రక్రియ ముగిసింది. ఆన్‌లైన్‌లో అత్యంత పారదర్శకతతో పూర్తి చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పదోన్నతుల కల్పించడంలో ప్రత్యేక చొరవ చూపించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ఉపాధ్యాయ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.