ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను ఖరారు చేస్తూ కేబినెట్ తీర్మానం

తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం, ఉర్దూ దినపత్రిక సియాసత్ డైలీ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటా కింద

By Medi Samrat
Published on : 12 March 2024 5:15 PM IST

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను ఖరారు చేస్తూ కేబినెట్ తీర్మానం

తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం, ఉర్దూ దినపత్రిక సియాసత్ డైలీ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేస్తూ తెలంగాణ మంత్రివర్గం మంగళవారం మార్చి 12న తీర్మానం చేసింది. గత వారం వీరిద్దరి నామినేషన్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో మరోసారి ఇద్ద‌రి పేర్ల‌ను కేబినెట్ తీర్మానించింది.

శాసనమండలిలో తమ నామినేషన్‌ల‌ను తిరస్కరించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చర్యను సవాల్ చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేతలు చేసిన అభ్యర్థనలకు ప్రతిస్పందనగా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

BRS నాయకులు దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణలను MLCలుగా నామినేట్ చేయడానికి BRS గత తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేయగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లను నామినేట్ చేసింది.

గతేడాది జూలైలో అప్పటి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన సిఫారసును గవర్నర్‌కు పంపారు. అయితే ఇద్దరూ "రాజకీయ సంబంధం కలిగిన‌ వ్యక్తులు" అనే కారణంతో గ‌వ‌ర్న‌ర్‌ సెప్టెంబర్ 19న నామినేషన్లను తిరస్కరించింది.

శాసనమండలికి తమ నామినేషన్‌ను తిరస్కరించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చర్యను సవాల్ చేస్తూ శ్రవణ్ కుమార్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఉత్తర్వులను ప్రకటిస్తూ.. కేబినెట్ సలహాకు గవర్నర్ కట్టుబడి ఉంటారని పేర్కొంది. అవసరమైన పత్రాలు, సమాచారాన్ని అందజేయడం లేదా మంత్రి మండలి చేసిన సిఫార్సును పునఃపరిశీలించడం కోసం మంత్రి మండలికి పంపే అధికారం గవర్నర్‌కు ఉందని కోర్టు పేర్కొంది.

Next Story