తెలంగాణలో అన్‌లాక్ గైడ్‌లైన్స్.. ఇవి పాటించ‌క‌పోతే ఇక అంతే..

Telangana govt Releases Unlock Guidelines.క‌రోనా కార‌ణంగా విధించిన లాక్‌డౌన్‌ను నేటి(ఆదివారం) నుంచి సంపూర్ణంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jun 2021 7:19 AM IST
తెలంగాణలో అన్‌లాక్ గైడ్‌లైన్స్.. ఇవి పాటించ‌క‌పోతే ఇక అంతే..

క‌రోనా కార‌ణంగా విధించిన లాక్‌డౌన్‌ను నేటి(ఆదివారం) నుంచి సంపూర్ణంగా ఎత్తివేయాల‌ని తెలంగాణ రాష్ట్ర క్యాబినేట్ నిర్ణ‌యించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికల మేరకు లాక్ డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం గైడ్‌లైన్స్(మార్గ‌ద‌ర్శ‌కాల‌ను) విడుద‌ల చేసింది.

ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధ‌రించాల‌ని ప్ర‌క‌టించింది. మాస్క్ లేకుండా క‌నిపిస్తే.. రూ.1000 పైన్ వేస్తామ‌ని తెలిపింది. ఇక ఆపీసులు, దుకాణాలు త‌దిత‌ర ప్ర‌దేశాల్లో జ‌నాలు ఎక్కువ‌గా గుమిగూడ చోట కొవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. లాక్‌డౌన్ ఎత్తివేసినంత మాత్ర‌న నిర్ల‌క్ష్యం త‌గ‌ద‌ని సూచించింది.

మార్గదర్శకాలివీ..

- బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కు ధరించడం తప్పనిసరి.

- మాస్కు ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా.

- ఆఫీసులు, దుకాణాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి.

- భౌతిక దూరం, శానిటైజేషన్‌ తప్పనిసరి.

- జూలై 1 నుంచి విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు తెరిచేందుకు అనుమతి.

Next Story