హైదరాబాద్ ఓఆర్ఆర్ విషయమై తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఓఆర్ఆర్ నిర్వహణను ప్రైవేటు కంపనీకి అప్పగించడంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటీ కూడా ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టారని విమర్శించారు. దేశంలో అత్యంత వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని అయితే ఓఆర్ఆర్ నిర్వహణకు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా కంపెనీని తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసిందని తెలిపారు. ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏముందని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. HMDA టోల్ ట్యాక్స్ ద్వారా 30 ఏళ్లలో రూ. 75 వేల కోట్ల ఆదాయం వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ORRపై ఆదాయం పెరుగుతుంది కానీ తగ్గదు. నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారమే లీజుకు ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న మాటలలో డ్ మాత్రం నిజం లేదని.. ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెబుతున్న బీఆర్‌ఎస్ పార్టీ ఓఆర్‌ఆర్‌ను ప్రైవేట్ కంపెనీకి ఎందుకు లీజుకు ఇచ్చిందనిత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్ ప్రైవేటీకరణ పేరుతో కల్వకుంట్ల కుటుంబం కొత్త డ్రామాకు తెరలేపిందని ఆరోపించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెబుతున్న సీఎం కేసీఆర్ కుటుంబం.. రూ.వేల కోట్ల ప్రభుత్వ ఆదాయాన్ని ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తోందంటూ విమర్శించారు. హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌కు ఇది విరుద్ధమని అన్నారు కిషన్ రెడ్డి.