తెలంగాణలో ఇంజనీరింగ్ ఫీజుల ఖరారు.. CBITలో రూ.1.83 లక్షలు, కనీస ఫీజు రూ.45 వేలు

తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో బి.ఇ, బి.టెక్ కోర్సులకు సంబంధించి కొత్త ట్యూషన్ ఫీజులను ఖరారు చేస్తూ జీవో ఎంఎస్ నెం. 06 విడుదల చేసింది.

By -  Knakam Karthik
Published on : 6 March 2026 1:57 PM IST

Telangana, Engineering Fees, TS Govt, Education Alert, BTech, Engineering Admissions

తెలంగాణలో ఇంజనీరింగ్ ఫీజుల ఖరారు.. CBITలో రూ.1.83 లక్షలు, కనీస ఫీజు రూ.45 వేలు

తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో బి.ఇ, బి.టెక్ కోర్సులకు సంబంధించి కొత్త ట్యూషన్ ఫీజులను ఖరారు చేస్తూ జీవో ఎంఎస్ నెం. 06 విడుదల చేసింది. ఈ సవరించిన ఫీజుల నిర్మాణం 2025-26 నుండి 2027-28 వరకు వర్తించనుంది. రాష్ట్రంలోని 160 కళాశాలలకు గాను, అత్యధికంగా సీబీఐటీ (CBIT)లో ఏడాదికి రూ. 1,83,000 ఫీజుగా నిర్ణయించగా, 21 కాలేజీల్లో కనీస ఫీజును రూ. 45,000గా ఫిక్స్ చేశారు. మొత్తం 69 కాలేజీల్లో ఫీజులు పెరగగా, 19 కాలేజీల్లో ప్రభుత్వం ఫీజులను తగ్గించింది. నిబంధనల ప్రకారం నిర్ణీత ఫీజు కంటే అదనంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

Next Story