'TS' స్థానంలో 'TG'.. తక్షణమే అమలులోకి!!

'TS' స్థానంలో 'TG' వచ్చేలా వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారులందరినీ ఆదేశించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 May 2024 3:00 AM GMT
Telangana govt, TG, TS, RTO

'TS' స్థానంలో 'TG'.. తక్షణమే అమలులోకి!! 

'TS' స్థానంలో 'TG' వచ్చేలా వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారులందరినీ ఆదేశించింది. గత డిసెంబర్ లో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం TS పేరును TGగా మార్చాలని నిర్ణయించింది. గత కేబినెట్ భేటీలో తెలంగాణ స్టేట్ (TS) బదులుగా తెలంగాణ గవర్నమెంట్ (TG) అని మార్చాలని నిర్ణయించగా.. రాష్ట్రంలో ఇకపై అన్ని ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు, అటానమస్ సంస్థలు సైతం తెలంగాణ కోడ్ ను టీఎస్ బదులుగా టీజీని వాడాలని ప్రభుత్వం ప్రకటించింది.

భారత రాష్ట్ర సమితి (గతంలో టిఆర్‌ఎస్) టిఆర్‌ఎస్‌తో సరిపోయేలా 'టీఎస్’ కోడ్‌ను ఎంచుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ కోడ్ అధికారికంగా మునుపటి ప్రిఫిక్స్ నుండి టీజీకి మార్చేశారు. “అన్ని రాష్ట్ర PSUలు, ఏజెన్సీలు, స్వయంప్రతిపత్త సంస్థలు, ఏవైనా ఇతర ప్రభుత్వ సంస్థలు, అధికారిక పత్రాలు (లెటర్‌హెడ్‌లు, నివేదికలు, నోటిఫికేషన్‌లతో సహా) వాటిలో 'TS'కు సంబంధించిన అన్ని సూచనలను 'TG'తో భర్తీ చేయాలని సచివాలయంలోని అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు.. ఏదైనా ఇతర అధికారిక కమ్యూనికేషన్ కు సంబంధించి ఈ కొత్త ఆదేశాలు వెలువడ్డాయి,” అని తెలంగాణ ప్రభుత్వం నుండి నోటిఫికేషన్ వచ్చింది.

Next Story