తెలంగాణ చిహ్నంలో మార్పులకు సీఎం నిర్ణయం.. నమూనాల పరిశీలన

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది.

By Srikanth Gundamalla  Published on  27 May 2024 2:28 PM IST
telangana govt,  state symbol, cm revanth reddy,

తెలంగాణ చిహ్నంలో మార్పులకు సీఎం నిర్ణయం.. నమూనాల పరిశీలన 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ప్రగతిభవన్‌ పేరును అంబేద్కర్‌ ప్రజా భవన్‌గా మార్చారు. అక్కడున్న రక్షణ వలయాలను కూడా తొలిగించారు. అంతెందుకు ఇటీవలే టీఎస్‌ స్థానంలో టీజీని చేర్చారు. దాంతో.. వాహనాల రిజిస్ట్రేషన్‌లలో టీఎస్‌కి బదులుగా టీజీ అని వస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం కూడా తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర పదో అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారులు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పలు నమూనాలను పరిశీలించారు. ఈ మేరకు పలు నమూనాలను చూసిన తర్వాత.. పలు సూచనలు కూడా చేశారు. రుద్ర రాజేశం కూడా కొత్త చిహ్నం రెడీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఒకటి రెండ్రోజుల్లో ఫైనల్ ఏసి రెండో తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున కొత్త చిహ్నాన్ని ప్రకటించేందుకు కసరత్తు చేసింది రాష్ట్ర ప్రభత్వం. తెలంగాణ చిహ్నంలోనూ ఉద్యమ స్ఫూర్తి, అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story