తెలంగాణ మహిళా నిరుద్యోగులకు సూపర్ న్యూస్..ఆ శాఖలో 14,236 పోస్టులు

తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

By Knakam Karthik  Published on  22 Feb 2025 10:58 AM
Telangana, Govt Of Telangana, Minister Seetakka, Angawadi Teachers And Helpers, Jobs

తెలంగాణ మహిళా నిరుద్యోగులకు సూపర్ న్యూస్..ఆ శాఖలో 14,236 పోస్టులు

తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం రెడీ అయింది. 6,399 అంగన్వాడీ టీచర్, 7,837 హెల్పర్ల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఫైల్‌పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు.

ఎన్నికల కోడ్ ముగియగానే ఉద్యోగాలకు ఆయా జిల్లాలకు చెందిన కలెక్టర్లు నోటిఫికేష‌న్ల‌ను జారీ చేయ‌నున్నారు. మొత్తం 14,236 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. తెలంగాణలో ఈ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల కొలువులను భర్తీ చేయడం ఇదే తొలిసారి. ఖాళీల భర్తీ ప్రక్రియతో మరింత పటిష్టంగా అంగన్వాడీలు పని చేయనున్నాయి.

Next Story