తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..రేపు ఐచ్ఛిక సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

తెలంగాణలోని ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసపు ఆఖరి శుక్రవారం ‘జుమాతుల్ విదా’ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By -  Knakam Karthik
Published on : 19 March 2026 12:30 PM IST

Telangana Govt, Ramadan2026, Jumat Ul Vida, Optional Holiday, Govt Employees

తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..రేపు ఐచ్ఛిక సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

తెలంగాణలోని ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసపు ఆఖరి శుక్రవారం ‘జుమాతుల్ విదా’ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు (మార్చి 20) రాష్ట్రవ్యాప్తంగా ఐచ్ఛిక సెలవు (Optional Holiday) ప్రకటిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

వాస్తవానికి ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఈ సెలవును తొలుత మార్చి 13న ఇవ్వాలని భావించారు. అయితే, రంజాన్ మాసపు చంద్రదర్శనం మరియు పండుగ కాలాన్ని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు, ఈ సెలవును మార్చి 20కి మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వక్ఫ్ బోర్డు సిఫారసును పరిశీలించిన రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ (GAD), గతంలో ఉన్న తేదీని సవరిస్తూ మార్చి 20న ఐచ్ఛిక సెలవును ఖరారు చేసింది. ఈ నిర్ణయం వల్ల రంజాన్ మాసపు చివరి శుక్రవారం నాడు ప్రత్యేక ప్రార్థనలు (నమాజ్) చేసుకునే ముస్లిం ఉద్యోగులకు ఎంతో ఊరట లభించనుంది. పండుగ వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Next Story