Telangana: ఆ గ్రామాలకు ఉచిత సోలార్‌ విద్యుత్‌.. ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన గ్రామాల్లోని ప్రజలకు పూర్తి ఉచితంగా సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది.

By అంజి  Published on  17 Sep 2024 1:10 AM GMT
Telangana government, free solar power, villages, pilot project, Telangana

Telangana: ఆ గ్రామాలకు ఉచిత సోలార్‌ విద్యుత్‌.. ప్రభుత్వం నిర్ణయం 

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన గ్రామాల్లోని ప్రజలకు పూర్తి ఉచితంగా సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది. సీఎం రేవంత్‌ స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఇప్పటికే దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(TGSPDCL) అధికారులు సర్వే చేశారు. అటు ఖమ్మం జిల్లా సిరిపురంతో కలిపి మొత్తం 30 గ్రామాల్లో పైలట్‌ ప్రాజెక్ట్ కింద సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేయనున్నారు. గ్రామాల ఎంపిక అంశాన్ని రాష్ట్రంలోని రెండు డిస్కంలు పరిశీలిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి సూర్యఘర్‌ యోజన పథకాన్ని అమలు చేస్తోంది.ఈ పథకం లక్ష్యం కోటి ఇళ్లపై సౌర విద్యుత్‌ ఏర్పాటు చేయడం.

ఇందులో భాగంగానే మోడల్‌ సోలార్‌ విలేజ్‌ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంఎన్‌ఆర్‌ఈ రాష్ట్రానికి మార్గదర్శకాల ప్రకారం.. ఈ పథకం కింది ఒక్కో జిల్లాకు ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేస్తే కోటి రూపాయలు గ్రాంటుగా ఇస్తారు. ఈ క్రమంలోనే జిల్లాకో గ్రామాన్ని ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేయబడిన గ్రామాల్లో ప్రతి ఇల్లు, కార్యాలయం, వ్యవసాయ బోర్లు సహా మొత్తం అన్నింటికీ సోలార్‌ విద్యుత్‌ను పూర్తిగా డిస్కం వ్యయంతోనే ఏర్పాటు చేయనున్నారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో అమలు చేసే సోలార్‌ విజేల్‌ పథకంలో స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేస్తారు.

Next Story