హైదరాబాద్: ఇకపై లబ్ధిదారులే తమ ఇందిరమ్మ ఇళ్ల ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. దాన్ని బట్టి బిల్లులు విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఈ మేరకు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల యాప్‌పై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఫొటోలు తీయడం ఆలస్యం కావడంతో బిల్లులు రాక ఇబ్బందులు ఏర్పడుతున్నట్టు గుర్తించామన్నారు.
ఇదిలా ఉంటే.. ప్రభుత్వం మరోసారి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రీసర్వే చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద పీఎం ఆవాస్ యోజన నిధులు విడుదల అయ్యేందుకు క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ మొదలుపెట్టింది. గ్రామాల్లో ఇప్పటికే ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారి వివరాలను కార్యదర్శులు మళ్లీ సేకరిస్తున్నారు. దాదాపు 60 ప్రశ్నలకు సమాధానాలను యాప్‌లో ఎంటర్ చేస్తున్నారు. ఇందుకు ఈ నెల 9 వరకు డెడ్‌లైన్ విధించినట్టు తెలుస్తోంది.
అర్హు లందరికీ ఇందిరమ్మ ఇల్లు మం జూరు చేస్తామని పర్యాటక, ఎక్సై జ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా వుఅన్నారు. గురువారం కొల్లాపూ ర్ పట్టణంలోని ఒకటో వార్డులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను మంత్రి అందించారు.