తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రంగారెడ్డి, ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో నాలుగు ఆర్‌ఓబిఎస్‌ల నిర్మాణానికి.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం రూ.404.82 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ నిర్మాణాలను 50:50 వ్యయ భాగస్వామ్య ప్రాతిపదికన రైల్వేతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. ప్రాజెక్టుల అమలుకు రూ.404.82 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వీ ప్రశాంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
రూ.404.82 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.250.02 కోట్లు, రైల్వే వాటా రూ.154.80 కోట్లుగా ఉంటుందని తెలిపారు. చటాన్‌పల్లి, షాద్‌నగర్‌లో రూ.95 కోట్లతో నాలుగు ఆర్‌ఓబీలు, రూ.97.20 కోట్లతో ఆదిలాబాద్ మార్కెట్ యార్డు, పెద్దపల్లి పట్టణంలో రూ. 119.50 కోట్లు, మాధవనగర్, నిజామాబాద్ రూ.93.12 కోట్లతో ఆర్‌ఓబీలు నిర్మించనున్నారు. ఈ ఆర్‌ఓబీల నిర్మాణంతో ఆయా జిల్లాల వాహనదారులు ఆలస్యం కాకుండా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.