తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ జీవో రిలీజ్ చేసింది. అయితే రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. కులగణన ఆధారంగా వార్డు సభ్యుల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కేటాయించనున్నారు.
కులగణన ఆధారంగా బీసీలకే సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు 2011 జనాభా లెక్కల ప్రకారం సర్పంచ్ పదవులకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కేటాయించనున్నారు. కాగా సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లను ఎంపీడీవోలు ఖరారు చేయనున్నారు. అటు వార్డు మెంబర్ల రిజర్వేషన్లను కూడా ఎంపీడీవోలే ఖరారు చేయనున్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు.