టీటీడీ సిఫార్సు లేఖలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి రాష్ట్ర ప్రజా ప్రతినిధులు తమ సిఫార్సు లేఖలను ఆన్‌లైన్‌లో జారీ చేసేలా సీఎంవో ఓ ప్రత్యేక పోర్టల్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. cmottd.telangana.gov.in పోర్టల్‌లో ఇక నుండి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను నమోదు చేయాలని సీఎంవో స్పష్టం చేసింది.
ఈ పోర్టల్ నుంచి భక్తులు, దర్శన వివరాలతో జారీ అయ్యే లేఖలను టీటీడీ అంగీకరిస్తుందని తెలిపింది. ఈ లేఖలతో సోమవారం నుండి గురువారం వరకు దర్శనాలు కల్పిస్తారు. ప్రత్యేక పోర్టల్ ద్వారా స్కాన్ చేసి పంపిన భక్తుల లెటర్స్ కే వీఐపీ బ్రేక్ దర్శనాలు, రూ.300 టికెట్ దర్శనాలు ఉంటాయని తెలిపింది. పోర్టల్ లో స్కాన్ చేసిన సిఫార్సు లెటర్స్ నే టిటిడి పరిగణలోకి తీసుకుంటుందని తెలంగాణ సీఎంవో పేర్కొంది.