తెలంగాణలో రైతు రుణమాఫీ రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. రూ.1.50 లక్షల లోపు రుణాలు ఉన్న వారికి ఖాతాల్లో మాఫీ డబ్బుల జమను సీఎం రేవంత్ రేపు లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లక్ష రూపాయల లోపు రుణాలు ఉన్న వారికి మాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అటు ఆగస్టు నెలఖారులోగా రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న వారికి మాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.
జూలై 31లోపు రైతులకు రూ.1.5 లక్షల వరకు రుణమాఫీ రెండో దశ అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అనుముల కల్వకుర్తి సభలో అన్నారు. రుణమాఫీ పథకం కింద ఇప్పటి వరకు రూ.6,093 కోట్లు రైతు ఖాతాల్లో జమ చేసినట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 2 నుంచి 14 వరకు విదేశాల్లో పర్యటిస్తానని.. తిరిగి వచ్చిన తర్వాత రైతుల రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తానని సీఎం చెప్పారు.