Telangana: రేపే గ్రూప్‌-1 పరీక్ష.. నేడు కీలక ప్రకటన

గ్రూప్‌-1 మెయిన్స్ ్వాయిదా వేయాలనే డిమాండ్‌ నేపథ్యంలో అభ్యర్థుల సందేహాలు తీర్చేందుకు ప్రభుత్వం నేడు మీడియాతో సమావేశం నిర్వహించనుంది.

By అంజి  Published on  20 Oct 2024 9:45 AM IST
Telangana government, Group-1 exam, Group-1, Hyderabad

Telangana: రేపే గ్రూప్‌-1 పరీక్ష.. నేడు కీలక ప్రకటన

హైదరాబాద్‌: గ్రూప్‌-1 మెయిన్స్ ్వాయిదా వేయాలనే డిమాండ్‌ నేపథ్యంలో అభ్యర్థుల సందేహాలు తీర్చేందుకు ప్రభుత్వం నేడు మీడియాతో సమావేశం నిర్వహించనుంది. పరీక్ష వల్ల ఏ ఒక్క అభ్యర్థి నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిన్న అధికారులతో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌ బాబు, రాజనర్సింహ, కొండా సురేఖ చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

రేపటి నుంచి గ్రూప్‌ -1 పరీక్షలు జరగనున్నాయి. 27వ తేదీ వరకు పరీక్షలు పూర్తి కానున్నాయి. ఈ క్రమంలోనే పరీక్షా కేంద్రాల దగ్గర పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనలు చేస్తుండటంతో టీజీపీఎస్‌సీ సూచనలతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కో ఎగ్జామ్‌ సెంటర్‌ వద్ద ఎస్‌ఐ ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 వరకు అభ్యర్థులను ఎగ్జామ్‌ సెంటర్‌లోకి అనుమతి ఇస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

గ్రూప్‌-1 అభ్యర్థుల డిమాండ్లు ఇవే

జీవో 29 రద్దు చేయాలి. పోస్టుల సంఖ్యను పెంచాలి. మెయిన్స్ రీషెడ్యూల్‌ చేయాలి. ప్రిలిమ్స్‌ ఫలితాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేయాలి. ప్రామాణిక పుస్తకాలపై స్పష్టత ఇవ్వాలి. కోర్టు కేసులు క్లియర్ చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలి. పరీక్షలు పూర్తై, భర్తీ ప్రక్రియ వరకూ ఒకే హాల్‌టికెట్ నంబర్‌ ఉండాలి. హైదరాబాద్‌తో పాటు వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ వంటి నగరాల్లోనూ పరీక్షలు నిర్వహించాలి.

Next Story