తెలంగాణ రైతులకు శుభవార్త.. ఖాతాల్లో బోనస్‌ డబ్బుల జమ

తెలంగాణ సర్కార్‌.. రైతులకు మరో శుభవార్త చెప్పింది. రైతుల ఖాతాల్లో బోనస్‌ డబ్బులు జమ చేస్తోంది.

By అంజి  Published on  17 Nov 2024 1:46 AM GMT
Telangana government, bonus money, farmers, bank accounts

తెలంగాణ రైతులకు శుభవార్త.. ఖాతాల్లో బోనస్‌ డబ్బుల జమ

తెలంగాణ సర్కార్‌.. రైతులకు మరో శుభవార్త చెప్పింది. రైతుల ఖాతాల్లో బోనస్‌ డబ్బులు జమ చేస్తోంది. సన్న రకం వడ్లు క్వింటాకు రూ.500 చొప్పున అధికారులు జమ చేస్తున్నారు. ఈ నెల 11న ప్రయోగాత్మకంగా ఒక రైతు ఖాతాలో క్వింటాకు రూ.500 చొప్పున రూ.30 వేలు జమ చేశారు. నిన్న రూ.కోటికిపైగా చెక్కులను పౌరసరఫరాల శాఖ జారీ చేయగా, 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి క్వింటాకు అదనంగా 500 చొప్పున రైతుల అకౌంట్లోకి బోనస్ డబ్బులు చేస్తుంది. అయితే బోనస్‌ రావడానికి ఒక ప్రాసెస్ ఉంటుందని అధికారులు అంటున్నారు.

సన్న రకాల వడ్లు కొనుగోలు చేశాక దానికి సంబంధించిన వివరాలు ప్రభుత్వానికి చేరాతాయి. ఆ తర్వాత ఒక ప్రాసెస్ ప్రకారం రైతుల ఖాతాల్లోకి బోనస్ ఎంత చెల్లించాలనేదానిపై వారం రోజుల వ్యవధిలో సమాచారం సేకరిస్తారు. ప్రభుత్వం వద్దకు ఈ సమాచారం వచ్చిన వెంటనే రూ.500 బోనస్‌ను రైతు ఖాతాలోకి రిలీజ్ చేస్తారు. నగదు రిలీజ్ చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి ఆ డబ్బులు జమ అవుతాయి. ఈ ఖరీఫ్ సీజన్‌కి నవంబర్ 16న రైతు ఖాతాల్లోకి డబ్బులను ప్రభుత్వం జమ చేయడం ప్రారంభించిందని అధికారులు చెబుతున్నారు. బోనస్ నగదు ఖాతాల్లో పడుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story