తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు..పుకార్లను నమ్మవద్దని ప్రభుత్వం స్పష్టం
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ లేదా డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల కొరత ఏమీ లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది
By - Knakam Karthik |
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు..పుకార్లను నమ్మవద్దని ప్రభుత్వం స్పష్టం
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ లేదా డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల కొరత ఏమీ లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సరఫరా వ్యవస్థ అంతా సజావుగా ఉందని, ప్రజల అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారిక ప్రకటన విడుదల చేసింది. కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న భారీ క్యూలు కేవలం పుకార్ల వల్ల ప్రజల్లో కలిగిన ఆందోళన (పానిక్ బయింగ్) వల్లే ఏర్పడ్డాయని, ఇది తాత్కాలిక అంతరాయమే తప్ప ఇంధన కొరత కాదని ప్రభుత్వం వివరించింది. కొన్ని బంకుల్లో కనిపిస్తున్న స్వల్ప ఆలస్యానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అంతర్గత పరిపాలనా మార్పులే కారణమని పేర్కొంది.
ఇదే సమయంలో అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ లేదా ఎల్‌పీజీ సిలిండర్ల దుర్వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజలు అనవసరంగా భయాందోళనలకు గురికావద్దని, పుకార్లను నమ్మవద్దని సూచించింది. కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, ధృవీకరించని సందేశాలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని కోరింది. ఏవైనా సమస్యలు ఉంటే పౌర సరఫరా శాఖ హెల్ప్‌లైన్ నంబర్ 1967కు ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది.
#Hyderabad:#Nofuelshortage in #Telangana: Govt ClarifiesThe Telangana Govt has confirmed there is NO shortage of #petrol, #diesel, or domestic #LPG across the state.Supply chains are fully operational with sufficient stock to meet #dailyneeds.#Longqueues at some #outlets… pic.twitter.com/xqaqDMPb4v
— NewsMeter (@NewsMeter_In) March 24, 2026