హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకే ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ మేనేజ్‌మెంట్ కోటా సీట్లన్నీ ఆల్ ఇండియా కేటగిరీలో భర్తీ చేయగా..ఇకపై 85 శాతం సీట్లు తెలంగాణ బిడ్డలకే ఇవ్వనున్న సర్కార్ ప్రకటించింది.
ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విజ్ఞప్తితో మేనేజ్‌మెంట్ కోటాలో 85 శాతం సీట్లు లోకల్ విద్యార్థులకు కేటాయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని హెల్త్ సెక్రటరీని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నిర్ణయంలో రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 318 మెడికల్ పీజీ, 70 డెంటల్ పీజీ సీట్లు దక్కనున్నాయి. మరో వైపు రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరగనుంది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకుంది.