అలర్ట్.. డీఎస్సీ దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం
బుధవారం టెట్ 2024 ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla
అలర్ట్.. డీఎస్సీ దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం
తెలంగాణలో విద్యాశాఖ అధికారులు బుధవారం టెట్ 2024 ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డీఎస్సీ దరఖాస్తు దారులకు అలర్ట్ చేసింది. టెట్ స్కోర్‌తో పాటు ఇతర వివరాలను ఎడిట్ చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశం కల్పిస్తోంది. టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి డీఎస్సీ పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
టెట్ పేపర్ -1లో 57,725, పేపర్ -2లో 51,443 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్1కు 85,996 మంది, పేపర్2 పరీక్షకు 1,50,491 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నిరుడు టెట్‌తో పోల్చితే ఉత్తీర్ణత శాతం పెరగడం విశేషం. ఇక అర్హత సాధించని అభ్యర్థులకు ప్రభుత్వం ఉపశమనం లభించింది. టెట్-2024లో అర్హత సాదించని దరఖాస్తుదారులకు డిసెంబర్ టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. టెట్-24లో అర్హత సాధించిన వారికి ఒకసారి డీఎస్సీ పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది. టెట్ మెమోలను https://schooledu.telangana.gov. in వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు అధికారులు తెలిపారు.