హైదరాబాద్: టెన్త్ ఫలితాలకు మోక్షం లభించనుంది. ఇప్పటి వరకు మెమోలపై గ్రేడ్లు, సీజీపీఏ రూపంలో ఇవ్వగా ఇకపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్ల రూపంలో ఇవ్వనున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రతిపాదనను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఫలితాలు రెండు మూడు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీబీఎస్‌ఈలోనూ సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇస్తున్నారు. 10వ తరగతి బోర్డు పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగాయి.
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు తమ ఎస్‌ఎస్‌సీ మార్క్స్ మెమో 2025ను తెలంగాణ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లు bse.telangana.gov.in, bseresults.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్లలో మీ మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఎస్‌ఎస్‌సీ విద్యార్థులు రిజల్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఈ ఫలితాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.