వచ్చే ఏడాది సెలవులను ప్రకటించిన తెలంగాణ సర్కార్
మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాది రాబోతుంది. వచ్చే ఏడాది సెలవులకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది ప్రభుత్వం.
By Srikanth Gundamalla
వచ్చే ఏడాది సెలవులను ప్రకటించిన తెలంగాణ సర్కార్
మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాది రాబోతుంది. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే.. 2023 ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది సెలవులకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాదిలో అన్ని పండుగలతో కలిసి 27 జనరల్ హాలీడేస్, 25 ఆప్షనల్ హాలిడేస్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
సాధారణ సెలవుల జాబితాలో జనవరి 1, జనవరి 14 (భోగీ), జనవరి 15 (సంక్రాంతి), జనవరి 26వ తేదీన (రిపబ్లిక్ డే), మార్చి 8 (మహాశివరాత్రి) సెలవును ఇచ్చింది ప్రభుత్వం. అలాగే మార్చి 25న (హోలీ), మార్చి 29న (గుడ్ ఫ్రైడే), ఏప్రిల్ 5న (బాబూ జగ్జీవన్‌రాం జయంతి), ఏప్రిల్ 9 (ఉగాది) , ఏప్రిల్ 11, 12న (రంజాన్), ఏప్రిల్ 14న (అంబేద్కర్ జయంతి), ఏప్రిల్ 17 (శ్రీరామనవమి), జూన్ 17 (బక్రీద్), జూలై 17 (మొహర్రం), జూలై 29 (బోనాలు), ఆగస్ట్ 15 (ఇండిపెండెన్స్ డే), 26 (శ్రీకృష్ణాష్టమి), సెప్టెంబర్ 7 (వినాయక చవితి), సెప్టెంబర్ 16 (ఈద్ మిలాద్ ఉన్ నబీ), అక్టోబర్ 2 (గాంధీ జయంతి), అక్టోబర్ 12, 13 (విజయదశమి), అక్టోబర్ 24 (దీపావళి), నవంబర్ 25 (గురునానక్ జయంతి), డిసెంబర్ 25, 26 రోజుల్లో (క్రిస్మస్) సాధారణ సెలవులను ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
ఆప్షనల్ హాలీడేస్ జాబితాలో.. జనవరి 16న (కనుమ), జనవరి 25న (హజ్రత్ అలీ బర్త్ డే)తో పాటు.. ఫిబ్రవరి 8న (షబ్ ఈ మిరాజ్), ఫిబ్రవరి 14 (శ్రీ పంచమి), ఫిబ్రవరి 26న (షబ్ ఈ బరత్), మార్చి 31న (షహదత్ హజత్ అలీ), ఏప్రిల్ 7 (షబ్ ఈ ఖదర్), ఏప్రిల్ 14న (తమిళ్ న్యూ ఇయర్స్ డే) ఆప్షనల్ హాలీడే ఇచ్చారు. ఏప్రిల్ 21న (మహావీర్ జయంతి), మే 10న (బసవ జయంతి), మే 23 (బుద్ధ పూర్ణిమ), జూన్ 25న (ఈద్ ఇ ఘదీర్), జూలై 7 (రత్నయాత్ర), జూలై 16న (మొహర్రం), ఆగస్టు 16 (వరలక్ష్మీ వ్రతం), ఆగస్టు 19 (శ్రావణ పూర్ణిమ), అక్టోబర్ 10 (దుర్గాష్టమి), అక్టోబర్ 11 (మహార్నవమి), అక్టోబర్ 30 (నరక చతుర్ది), నవంబర్ 16న (సయ్యద్ మహమ్మద్ జువాన్‌పురి మహదీ జయంతి) సందర్భంగా ఆప్షనల్ హాలీడేస్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
Holidays List 2024— #Telangana pic.twitter.com/hGPWNSsau5
— @Coreena Enet Suares (@CoreenaSuares2) December 12, 2023