తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దశాబ్ధి ఉత్సావాలు కావడంతో అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వంతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం ఒక్క రోజే ఉత్సవాలు జరుగునున్నాయి. కానీ.. బీఆర్ఎస్ మాత్రం మూడు రోజుల పాటు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. ముఖ్యంగా ట్యాంక్‌బండ్, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్‌పార్క్ వద్ద ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. అలాగే ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై నా ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో వాహనాదారులు ముందుగానే ఈ విషయం తెలుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని చెప్పారు.