మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తాను రోడ్డుపై పడి పోతానేమోనన్న భయంతో ఫ్రెండ్స్‌కో, క్యాబ్‌కో కాల్ చేయకుండా.. ఏకంగా 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తాను ఎమర్జెన్సీలో ఉన్నానని త్వరగా రావాలని చెప్పాడు. దీంతో అంబులెన్స్ స్పాట్‌కు చేరుకుంది. అయితే ఆ వ్యక్తి తనను జనగాం పట్టణంలో వదిలి వెళ్లాలని వేడుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తిమ్మాపూర్ బైపాస్ దగ్గర బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మద్యం మత్తులో ఉన్న రమేశ్.. జనగాం జిల్లా లింగాల ఘనపూర్ వెళ్లాలి. ఆ సమయంలో బస్సులు, ఇతర పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసులు లేకపోవడంతో.. ఆరోగ్యం బాగాలేదని 108కు కాల్ చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది అతడి పరిస్థితిని చూసి అవాకయ్యా రు. తనను జనగాంలో వదిలి వెళ్లాలని అంబులెన్స్ సిబ్బందిని కోరాడు. రమేశ్ మద్యం మత్తులో ఉండటంతో అక్కడే వదిలేసి వెళ్లారు.