Telangana Polls: ఈనెల 30 సా.5 గంటల వరకు సైలెన్స్ పీరియడ్
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఇవాళ్టితో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.
By - Srikanth Gundamalla |
Telangana Polls: ఈనెల 30 సా.5 గంటల వరకు సైలెన్స్ పీరియడ్
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఇవాళ్టితో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. కొన్ని చోట్ల సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగుస్తుండగా.. మిగతా అన్ని చోట్ల సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత ప్రజాప్రతినిధుల మైకులు అన్నీ మూగబోనున్నాయి. అయితే.. ఎన్నికల ప్రచారం తర్వాత తెర వెనుక పంపిణీలపై ఎన్నికల అధికారులు దృష్టిపెట్టారు. నేరుగా కాకుండా ఫోన్లలో మెసెజ్‌ల ద్వారా కూడా ప్రచారం జరగకుండా చూస్తున్నారు. ఈనేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సెలెన్స్ పీరియడ్‌గా ప్రకటించారు. అభ్యంతరకర, రాజకీయపరమైన, బల్క్ ఎస్ఎంఎస్‌ల ప్రసారం నిషేధనని తెలిపారు.
ఈ మేరకు ఇలాంటి ప్రసారాలపై నిశితంగా పర్యవేక్షించాలని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈ నెల 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. 48 గంటల ముందు నుంచే రాజకీయపరమైన ఎస్‌ఎంస్‌ల ప్రసారాలను ఎన్నికల కమిషన్ నిలిపివేయాలని ఆదేశించిందని ఆయన తెలిపారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్ ఆదేశాలు, సూచనలను పాటించేలా చూడాలన్నారు. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు ఎన్నికల అధికారి పమేలా సత్పతి. ఎస్‌ఎంఎస్‌లు పంపేందుకు అయ్యే ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
పోలింగ్ కోసం అన్ని ప్రాంతాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచే ఇతర ముఖ్య ఎన్నికల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా మేరకు వారికి పలు సూచనలు చేశారు. భద్రతా పరంగా.. ఎన్నికల ప్రలోభాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు .అలాగే ఓటర్లను స్వేచ్ఛగా తమ హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్.