Telangana Polls: ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల తొలి జాబితా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 6 Nov 2023 3:58 PM ISTTelangana Polls: ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల తొలి జాబితా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు దాదాపు అభ్యర్థులను ప్రకటించాయి. ఇక మరికొన్ని పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించాయి. ఇక ఎన్నికలు వస్తే చాలు హంగామా చేసే వ్యక్తి అంటే.. కేఏ పాల్ అనే చెప్పాలి. ఆయన ఎన్నికల వేళ చేసే స్టంట్స్ అన్నీ ఇన్నీ కావు. ప్రచారంలో వింతవింత చేష్టలతో కనిపిస్తుంటారు. ఆయన ప్రజాశాంతి పార్టీ నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించారు. 12 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.
అయితే.. ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేయాలనుకునేవారి నుంచి దరఖాస్తులు స్వీకరించామని కేఏ పాల్ వెల్లడించారు. దాంతో.. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 344 మంది టికెట్ కావాలంటూ అప్లికేషన్ పెట్టుకున్నారని చెప్పారు. అన్ని వర్గాల వారికీ తన పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు కేఏ పాల్. సోమవారం తొలి జాబితా విడుదల చేయగా.. వెంటనే మంగళవారం రెండో జాబితా విడుదల చేస్తామని చెప్పారు. ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాను విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని కేఏ పాల్ చెప్పారు.
తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు:
చెన్నూరు: మొయ్య రాంబాబు
జుక్కల్ (ఎస్సీ): కర్రోల్ల మోహన్
రామగుండం: బంగారు కనకరాజు
వేములవాడ: అజ్మీరా రమేశ్‌బాబు
నర్సాపురం: సిరిపురం బాబు
జహీరాబాద్: బేగరి దశరథ్
గజ్వేల్: పాండు
ఉప్పల్: కందూరు అనిల్ కుమార్
యాకుత్పురా: సిల్లివేరు నరేశ్
కల్వకుర్తి : కట్టా జంగయ్య
నకిరేకల్: కదిర కిరణ్‌కుమార్
మధిర : కొప్పుల శ్రీనివాస్ రావు