Telangana: ఓట్ల లెక్కింపునకు చకచకా ఏర్పాట్లు.. కౌంటింగ్ కేంద్రాలు ఇవిగో..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోంది.
By Srikanth Gundamalla Published on 1 Dec 2023 5:35 AM GMTTelangana: ఓట్ల లెక్కింపునకు చకచకా ఏర్పాట్లు.. కౌంటింగ్ కేంద్రాలు ఇవిగో..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోంది. ఇటు రాజకీయ నాయకులు, పోటీ చేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాస్త ఆందోళన కలిగిస్తున్నా.. అవన్నీ నమ్మకూడదని నేతలు కొట్టిపారేస్తున్నారు. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే. దీని కోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచారు.
ఆదివారం రోజు హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో పలు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. ఈవీఎంలు ఉన్న గదుల వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు అయ్యే వరకూ ఆయా గదుల వద్ద ఆంక్షలు విధించారు. స్ట్రాంగ్ రూములు ఉన్న ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు చెప్పారు. గుంపులుగా తిరిగితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు గురువారం నాడు పోలింగ్ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. పలుచోట్ల ఘర్షణలు జరిగినా.. చివరకు ఎన్నికలను ముగించేశారు అదికారులు. ఓటర్లు కూడా పట్టణాల నుంచి బారులు తీరి సొంత గ్రామాల్లో ఓటింగ్ చేశారు. కానీ.. గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం ఈసారి పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం గమనర్హం. ముఖ్యంగా పట్టణప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అయ్యింది.