తెలంగాణలో కాంగ్రెస్ లీడ్.. మాస్టర్ ప్లాన్‌తో డీకే శివకుమార్ రెడీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 3 Dec 2023 5:51 AM GMTతెలంగాణలో కాంగ్రెస్ లీడ్.. మాస్టర్ ప్లాన్‌తో డీకే శివకుమార్ రెడీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అయితే.. కాంగ్రెస్ లీడ్‌లో కనిపిస్తోంది. ఎగ్జిట్‌పోల్స్‌కు అనుగుణంగానే ఫలితాలు వెల్లడిఅవుతున్నాయనే చెప్పాలి. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగ్గా.. అన్ని స్థానాల్లో కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు అయితే 67 స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్‌లో కొనసాగుతోంది. అధికారపార్టీ బీఆర్ఎస్ 40 స్థానల్లో లీడింగ్‌లో ఉంది. కొన్ని స్థానల్లో అయితే.. హోరాహోరీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌దే విజయమని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ అధిక స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతుండటంతో.. ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. గాంధీ భవన్ వద్ద కోలాహలం కనిపిస్తోంది. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద బ్యాండ్లు, పటాసులతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
రేవంత్ రెడ్డి ఇంటి వద్ద సంబరాలు చేసుకుంటున్న అభిమానులు pic.twitter.com/GzRP96Ia9z
— Newsmeter Telugu (@NewsmeterTelugu) December 3, 2023
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకులు అంతా అప్రమత్తం అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. గెలిచిన వారిని కర్ణాటకకు తరలించేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. శనివారం రాత్రే ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయనతో పాటు కర్ణాటకకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ కు చేరుకుని ఫలితాలను వీక్షిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు తాజ్‌కృష్ణలో గదులను బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 గదులను రిజర్వ్ చేసినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులను వెంటనే తాజ్ కృష్ణకు తరలించనున్నారు.
ఆ తర్వాత వారిని అక్కడి నుంచి బస్సుల్లో కర్ణాటకకు తరలించేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారు డీకే శివకుమార్. అయితే.. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు పార్టీ మారకుండా చూసుకునేందుకే ఆయన హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. దాంతో.. ఎన్నికల ఫలితాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గెలిచినవారిని వెంటనే తాజ్‌కృష్ణకు తరలించి.. కర్ణాటకకు తీసుకెళ్లనున్నారు. ఇతర పార్టీల్లోకి జంప్ కాకుండా హస్తం పార్టీ ముందుగానే ప్లాన్ చేసుకుంటోంది.
Telangana | Luxury buses have been stationed at Hyderabad's Taj Krishna. pic.twitter.com/1hJsAsfJrd
— ANI (@ANI) December 3, 2023