తెలంగాణలో పోటీలో ఉన్న జనసేన అభ్యర్థులు ఎక్కడ..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  3 Dec 2023 7:12 AM GMT
telangana, election results, janasena,

తెలంగాణలో పోటీలో ఉన్న జనసేన అభ్యర్థులు ఎక్కడ..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ను నిజం చేస్తున్నట్లుగానే ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ అత్యధిక స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ అశ్వరావుపేట, ఇల్లందు, రామగుడంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. మరో 63 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. ఎంఐఎం చార్మినార్ అసెంబ్లీలో విజయాన్ని అందుకుంది. అధికార పార్టీ బీఆర్ఎస్‌ 40 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. బీజేపీ 9 స్థానాల్లో ముందంజలో ఉండగా.. బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన మాత్రం ఏమాత్రం తన హవా చూపించలేకపోయింది.

పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది జనసేన. పొత్తుల భాగంగా బీజేపీ మద్దతుతో జనసేన మొత్తం 8 స్థానాల్లో పోటీ చేసింది. అయితే.. ఫలితాల్లో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆయన నేరుగా ప్రచారంలో పాల్గొన్నా కూడా అభ్యర్థుల గెలుపునకు పాజిటివ్‌ అవ్వలేకపోయింది. పవన్‌ కళ్యాణ్ కోరినా కూడా పెద్ద ఎత్తున ఓటర్లు జనసేనకు ఓటు వేసినట్లుగా కనిపించడం లేదు.

అశ్వారావుపేటలో ఇప్పటికే కాంగ్రెస్‌ గెలిచింది. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆదినారాయణ విజయాన్ని అందుకున్నారు. ఇక ఇక్కడ బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలవగా.. మూడో స్థానంలో సీపీఐ నిలిచింది. జనసేన అభ్యర్థి ఉమా దేవి నాలుగో స్థానానికి పరిమితం అయ్యారు. ఇక మరికొన్ని చోట్ల అయితే.. ఇండిపెండెంట్ల కంటే వెనుకంజలో పడిపోయారు. కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌ కచ్చితంగా గెలుస్తారని జనసైనికులు అంతా నమ్మకం పెట్టుకున్నారు. కానీ అక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ లీడింగ్‌లో ఉంది. రెండోస్థానంలో కాంగ్రెస్‌ ఉండగా.. మూడోస్థానంలో జనసేన అభ్యర్థి ప్రేమకుమార్‌ వెనుకంజలో ఉన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే తొలిసారి పోటీ చేసిన జనసేనకు తెలంగాణలో ఒక్క సీటు దక్కేలా కనిపించడం లేదు.

Next Story