తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన గుర్తేంటి..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్ తగిలింది.
By Srikanth Gundamalla Published on 10 Nov 2023 10:53 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన గుర్తేంటి..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తుతో ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. పోటీ చేసేందుకు జనసేనకు బీజేపీ 8 స్థానాలను కేటాయించాయి. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభ్యర్థులను కూడా ప్రకటించారు. అయితే.. ఎన్నికల పోలింగ్‌కు ముందు జనసేకు బిగ్ షాక్ తగిలింది. తెలంగాన ఎన్నికల్లో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించలేదు. జనసేన వాడుకునే గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్‌గానే ఈసీఐ గుర్తించింది.
అయితే.. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం రాష్ట్రంలో జనసేనకు ప్రాంతీయ పార్టీగా గుర్తింపు లేదు. దాంతో.. పోటీలో ఉన్న అభ్యర్థులు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగనున్నారు. మరి వీరందరికీ ఈసీ ఒకే గుర్తు కేటాయిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక జనసేన పార్టీ అంటే గాజు గ్లాసు గుర్తు అందరికీ మదిలో మెదులుతోంది. అంతేకాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో ఈ గుర్తు బలంగా పాతుకు పోయింది. ఈ గుర్తు ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు కేటాయిస్తారా..? లేదంటే మరో గుర్తు కేటాయిస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.
కాగా.. తెలంగాణలోని జనసేన పోటీ చేస్తున్న ఎనిమిది నియోజకవర్గాల్లో గ్రేటర్ పరిధిలోని కీలక అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్న కూకట్‌పల్లి కూడా ఉంది. మరి ఇక్కడ ఎలాంటి ఫలితం వస్తుందో అని ఆసక్తి నెలకొంది.