తెలంగాణ ప్రభుత్వం రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ మేరకు శనివారం 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి క్యాలెండర్‌ను అధికారులు రిలీజ్ చేశారు. ఈ ఏడాదిలో ఉన్న సెలవుల వివరాలతో పాటు పరీక్షల వివరాలను వెల్లడించారు. కాగా.. ఈ ఏడాది జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఇక 2025 ఏప్రిల్ 23వ తేదీ వరకు పాఠశాలలు కొనసాగుతాయి. ఇక 2025 ఫిబ్రవరి 28వ తేదీ లోపు టెన్త్ ప్రీఫైనల్ పరీక్షలు పూర్తవుతాయి. 2025 మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించనున్నారు విద్యాశాఖ అధికారులు.
ఇక రాబోయే విద్యాసంవత్సరంలో సెలవులను చూసుకుంటే.. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దసరా సెలువులు ఉండనున్నాయి. డిసెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు క్రిస్మస్ సెలువులు ఉంటాయి. జనవరి 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటన చేసింది. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు.. అప్పర్ ప్రైమర్ స్కూల్స్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగుతాయని తెలంగాణ విద్యాశాఖ అధికారులు చెప్పారు.