Telangana: మరో దఫా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ

ఈ ఏడాది తెలంగాణ, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇక తెలంగాణలో ఎన్నికలకు

By అంజి
Published on : 28 May 2023 10:41 AM IST

Telangana, voter list, NVSP, Election Commission

Telangana: మరో దఫా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ

ఈ ఏడాది తెలంగాణ, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇక తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి సిద్ధమైంది. ఈ క్రమంలోనే వచ్చే నెల (జూన్‌) 23వ తేదీ నుంచి ఇంటింటికి సర్వ చేపట్టనున్నారు. ఆ తర్వాత పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి రేషనలైజేషన్‌ చేపడతారు. దీనికి సంబంధించి రెండో స్పెషల్​ సమ్మరీ రివిజన్​ను ఈసీ ప్రకటించింది.

ఆగస్టు 2వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అవుతుంది. ఆ వెంటనే ఆగస్టు 31 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. మార్పులు, చేర్పుల కోసం వచ్చే సెప్టెంబర్‌ 22లోపు దరఖాస్తులు సమర్పించాలని ఎన్నికల సంఘం తెలిపింది. ఇక చివరకు అక్టోబర్‌ 10వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల అవుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,99,77,659 మంది ఓటర్లు ఉన్నారు. అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే వారందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Next Story