తెలంగాణ‌లో ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీలు ఖరారు

Telangana eamcet exam 2021 date announced.తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ నిర్వ‌హ‌ణ తేదీలు ఖరారు అయ్యాయి. క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2021 2:52 PM GMT
తెలంగాణ‌లో ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీలు ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ నిర్వ‌హ‌ణ తేదీలు ఖరారు అయ్యాయి. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా వాయిదా ప‌డిన ప‌లు ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు సంబందించి తేదీల‌ను ఉన్న‌త విద్యామండ‌లి ఖ‌రారు చేసింది. ఆగస్టు 05వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) మోడ్‌లో ఎంసెట్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

ఆగ‌స్టు 3న ఈసెట్‌, ఆగ‌స్టు 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పీజీ ఈసెట్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇక జులై 1వ తేదీ నుంచి డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల‌కు ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది జులై 05వ తేదీ నుంచి ఎంసెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈనెల 03వ తేదీ వరకు దరఖాస్తుల గడువు ఇచ్చారు. ఈ గడువును తర్వాత పెంచారు. ఎలాంటి అప‌రాధ రుసుం లేకుండా ఈ నెల 24 వరకు ఎంసెట్‌ దరఖాస్తుల స్వీకరించ‌నున్నారు.

ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీలు

ఎంసెట్ ఇంజినీరింగ్ - 4,5,6 ఆగ‌స్టు 2021

ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్, మెడిస‌న్ - 9, 10 ఆగ‌స్టు 2021

ఈసెట్ 3 - ఆగ‌స్టు 2021

పీజీఈసెట్ - 11 నుంచి 14 ఆగ‌స్టు 2021

ఐసెట్ - 19,20 ఆగ‌స్టు 2021

లాసెట్ - 23 ఆగ‌స్టు 2021

ఎడ్‌సెట్ - 24,24 ఆగ‌స్టు 2021

పాలీసెట్ - 17 జులై 2021


Next Story
Share it