18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ హెల్త్ కార్డులు

తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

By అంజి  Published on  7 Feb 2024 6:30 AM IST
Telangana, Digital health cards, Congress Govt

18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ హెల్త్ కార్డులు

తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల ఆరోగ్య స్థితిగతులపై సమగ్ర సమాచారం అందుబాటులోకి తేవడంతో పాటు ఈ రికార్డుతో మెరుగైన, అత్యవసర వైద్య సేవలు అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని ఆధార్‌, ఆరోగ్యశ్రీ కార్డుతో అనుసంధానం చేయనుంది. కార్డుల జారీలో భాగంగా సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గత నెలలోనే ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్ తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. అలాగే ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులతో చర్చించారు. ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని అన్నారు.

Next Story