తెలంగాణలో దారుణం.. దానిమ్మ పండు తెంపాడని.. దళిత బాలుడిని కట్టేసి కొట్టారు

తన ఇంట్లో ఉన్న దానిమ్మ చెట్టు పండును తెంపినందుకు 14 ఏళ్ల దళిత బాలుడిని ఓ వ్యక్తి కట్టివేసి కొట్టారు.

By అంజి  Published on  26 Jun 2024 12:27 PM IST
Telangana, Dalit boy, pomegranate , Kesaram

తెలంగాణలో దారుణం.. దానిమ్మ పండు తెంపాడని.. దళిత బాలుడిని కట్టేసి కొట్టారు

హైదరాబాద్ నగర శివార్లలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన ఇంట్లో ఉన్న దానిమ్మ చెట్టు పండును తెంపినందుకు 14 ఏళ్ల దళిత బాలుడిని ఓ వ్యక్తి కట్టివేసి కొట్టినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ సంఘటన జూన్ 22న రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కేసారం గ్రామంలో జరిగింది. ఎస్సీ కమ్యూనిటీకి చెందిన బాధితుడు చెట్టుకు దానిమ్మ పండు కోసేందుకు ఇంటి కాంపౌండ్ వాల్‌ను ఎక్కినట్లు వారు తెలిపారు.

ఇంటి యజమాని, రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, బాలుడిని పట్టుకుని, అతని చేతులు, కాళ్ళు తాడుతో కట్టివేసి కొట్టినట్లు వారు తెలిపారు. బాలుడు నేలపై పడుకొబెట్టినట్టు చూపుతున్న ఫోటో వైరల్‌గా మారింది.

జూన్ 24న బాధితుడి తల్లి చేసిన ఫిర్యాదు ఆధారంగా, IPC సెక్షన్లు 342 (తప్పుగా నిర్బంధించడం), 324 (స్వచ్ఛందంగా గాయపరచడం), బాల్య న్యాయ చట్టంలోని సంబంధిత సెక్షన్లు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు (అత్యాచారాల నివారణ) కింద ఆ వ్యక్తి, అతని కుమారుడిపై కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారు సంఘటనా స్థలానికి వెళ్లినప్పుడు, ఆ వ్యక్తి, అతని కుమారుడు ఆమెను దుర్భాషలాడారని ఆరోపించింది.

Next Story