గతకొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 70,280 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 431 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 3,04,298కి చేరింది. నిన్న కరోనా కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1676కి చేరింది. అదే సమయంలో ఒక్క రోజులోనే 228 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకునన వారి సంఖ్య 2,99,270కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,352ఉండగా.. వీరిలో 1,395 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 111 కేసులు నమోదు అయ్యాయి. ఇక మొత్తంగా రాష్ట్రంలో 97,89,113 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,86,426 మందికి డోస్ 1, 2,24374 మందికి డోస్ 2 టీకా వేసినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది.