తెలంగాణ‌లో కొత్త‌గా 364 పాజిటివ్ కేసులు

Telangana corona bulletin update.గ‌త కొద్దిరోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. 66,036 క‌రోనా ప‌రీక్ష‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2021 10:34 AM IST
తెలంగాణ‌లో కొత్త‌గా 364 పాజిటివ్ కేసులు

గ‌త కొద్దిరోజులుగా తెలంగాణ‌ రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. 66,036 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కొత్త‌గా 364 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య 3,02,724కి చేరింది. నిన్న క‌రోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతు సంఖ్య 1,666కి చేరింది. క‌రోనా బారి నుంచి నిన్న 189 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,98,451కి చేరింది. ప్ర‌స్తుతం 2,607 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 980 మంది హోం ఐసోలేష‌న్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 75 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 95,48,685 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.




Next Story