కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 17 March 2024 2:17 PM ISTకాంగ్రెస్‌లో చేరిన ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్‌ను వీడిన కొద్దిగంటల్లోనే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్సీ, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్‌ను దానం నాగేందర్‌కు కాంగ్రెస్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్‌ను ఖాళీ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇటీవల రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, యాదయ్య కలిశారు. అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను మల్కాజిగిరి, మేడ్చల్ ఎమ్మెల్యేలు రాజశేఖర్‌రెడ్డి, మల్లారెడ్డి ఇటీవల కలిసిన విషయంత ఎలిసిందే. చేవెళ్ల పార్లమెంట్ నుంచి రంజిత్‌రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పట్నం సునీతారెడ్డిని బరిలోకి దించాలని కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ #Congress పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. pic.twitter.com/hlBqT430Sp
— Newsmeter Telugu (@NewsmeterTelugu) March 17, 2024