మంత్రి కోమటిరెడ్డి సభలో రచ్చ.. జెడ్పీ చైర్మన్‌తో వాగ్వాదం
యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లా గూడూరులో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్న సభ రచ్చరచ్చగా మారింది.
By Srikanth Gundamalla Published on 29 Jan 2024 5:06 PM ISTమంత్రి కోమటిరెడ్డి సభలో రచ్చ.. జెడ్పీ చైర్మన్‌తో వాగ్వాదం
యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లా గూడూరులో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్న సభ రచ్చరచ్చగా మారింది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ఇటీవలే పూర్తయింది. ఈ భవన ప్రారంభోత్సవం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి పాల్గొన్నారు. అయితే.. గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం తర్వాత అక్కడే సభ నిర్వహించారు.
ఈ సభలో మంత్రి కోమటిరెడ్డి పక్కనే జెడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి కూడా కూర్చొన్నారు. ముందుగా సందీప్‌రెడ్డి మాట్లాడేందుకు మైక్ తీసుకుని ప్రసంగాన్ని మొదు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. రెండు లక్షల రుణమాఫీ, రూ.4వేల పెన్షన్, రైతుబంధు పెంపు హామీలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమయానికి రైతుబంధు అందించిందని చెప్పారు. సందీప్‌రెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. సందీప్‌రెడ్డిని మాట్లాడనీయకుండా చేశారు.
ఇక ఆ తర్వాత మాట్లాడేందుకు మైక్ తీసుకున్న మంత్రి కోమటిరెడ్డి ముందుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై విమర్శలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి గురించి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడొద్దని హెచ్చరించారు. ఆ తర్వాత జెడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. మాధవరెడ్డి వంటి మహా నాయకుడి కడుపున పుట్టిన బచ్చా సందీప్‌రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతో.. అదే స్టేజ్‌పై ఉన్న సందీప్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. మంత్రి కోమటిరెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటా మాటా పెరగడంతో అక్కడ రచ్చరచ్చగా మారింది. పార్టీ కార్యకర్తలు, నేతలు నినాదాలు చేయడం మొదలుపెట్టారు.
దాంతో.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి వచ్చారు. ఇద్దరు నాయకులను వెనక్కి తగ్గాలంటూ కోరారు. కాసేపటికి జెడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డిని పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లారు. దాంతో.. ఉద్రిక్తతకు తెరపడినట్లు అయ్యింది.