రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. బుధవారం ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, గీతా రెడ్డి, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రవణ్, అంజన్ కుమార్, బలరాం నాయకర్, వీహెచ్ తదితరులు గవర్నర్‌తో భేటీ అయిన వారిలో ఉన్నారు.
అంతకముందు సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు సమావేశం అయ్యారు. దాదాపు13 అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని నిరుద్యోగం, 111 జీవో, విద్యుత్ ఛార్జీల పెంపు, డ్రగ్స్, ధరణి వెబ్ సైట్, రాష్ట్రంలో వైద్యారోగ్యం, ఇటీవల ఎంజీఎంలో ఎలుకలు కొరికిన ఘటన వంటి వాటిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి తక్కువ ధరకు అమ్మిన రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని కోరనున్నారు.