నెల రోజుల కాంగ్రెస్ పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 64 స్థానాల్లో గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  7 Jan 2024 5:45 AM GMT
telangana, congress govt, cm revanth reddy, tweet ,

నెల రోజుల కాంగ్రెస్ పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 64 స్థానాల్లో గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషం తెలిసిందే. అయితే.. నేటికి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నెల రోజులు పూర్తవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసి వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పెంపుపై నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఇప్పుడు మరిన్ని గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాపాలన పేరుతో పది రోజుల పాటు ఒకే అప్లికేషన్‌లో ఐదు గ్యారెంటీలకు అప్లికేషన్లు తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. డేటా ఎంట్రీ తర్వాత.. అర్హులను అధికారులు ఎంపిక చేస్తారు.

కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నెల రోజులు అవుతున్న సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు పెట్టారు. ఈ మేరకు పోస్టు పెట్టిన రేవంత్‌రెడ్డి.. ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ ప్రస్థానం తనకు తృప్తినిచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తాము సేవకులమే తప్ప పాలకులం కాదన్నమాట నిలబెట్టుకుంటామని చెప్పారు. పాలనను ప్రజలకు చేరువ చేస్తూ.. అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ చేసి ప్రమాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అలాగే పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ.. నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ.. మత్తులేని చైతన్య తెలంగాణకు గట్టి పట్టుదలతో బాధ్యతగా ఈ నెలరోజుల పాటు పాలన సాగిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా ఇకముందు కూడా తన బాధ్యత నిర్వర్తిస్తాననీ ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి రాసుకొచ్చారు.

Next Story