తెలంగాణ సీఎంవో వాట్సాప్‌ ఛానెల్‌ ప్రారంభం.. ఎలా ఫాలో కావాలంటే

తెలంగాణ ప్రభుత్వం, ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం 'వాట్సాప్ చానెల్' ని ప్రారంభించింది. ఈ చానెల్ ద్వారా ప్రభుత్వ ప్రకటనలను పౌరులకు చెరవేస్తుంది

By అంజి  Published on  21 Sep 2023 1:30 AM GMT
Telangana CMO, WhatsApp channel, Telangana

తెలంగాణ సీఎంవో వాట్సాప్‌ ఛానెల్‌ ప్రారంభం.. ఎలా ఫాలో కావాలంటే 

తెలంగాణ ప్రభుత్వం, ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలను చేరవేయడానికి అధునాతన సాంకేతిక మాధ్యమాలను, వేదికలను ఉపయోగించుకుంటున్నది. ఇదే కోవలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంఓ) 'వాట్సాప్ చానెల్' ను నిన్న ప్రారంభించింది. ఈ చానెల్ ద్వారా ప్రభుత్వం సీఎంఓ నుండి వెలువడే ప్రకటనలను పౌరులకు చెరవేస్తుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి కార్యాలయ వాట్సాప్ చానెల్ ను (Telangana CMO) వినియోగించుకోవడం ద్వారా సీఎం కేసీఆర్ వార్తలను ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది.

ఆసక్తిగల వారు కింద సూచించిన పద్ధతిలో సీఎంఓ చానెల్ లో చేరవచ్చు:

1. వాట్సాప్ అప్లికేషన్ ను తెరవండి.

2. మొబైల్ లో అయితే 'Updates' అనే విభాగాన్ని ఎన్నుకోండి. డెస్క్ టాప్ అయితే 'Channels' ట్యాబ్ పైన క్లిక్ చేయండి.

3. తర్వాత '+' బటన్ పైన క్లిక్ చేసి 'Find Channels' ను ఎన్నుకోండి.

4. టెక్స్ట్ బాక్స్ లో 'Telangana CMO' అని టైపు చేసి జాబితా నుండి చానెల్ ను ఎన్నుకోండి. చానెల్ పేరు పక్కన ఒక ఆకుపచ్చని టిక్ మార్క్ (‘green tick mark’) ను నిర్ధారించుకోండి.

5. 'Follow' బటన్ ని క్లిక్ చేసి తెలంగాణ సీఎంఓ చానెల్ లో చేరండి. సీఎంఓ పంపే ప్రకటనలను నేరుగా వాట్సాప్ లోనే చూడండి.

పైన ఇచ్చిన QR Code ను స్కాన్ చేయడం ద్వారా కూడా తెలంగాణ సీఎంఓ వాట్సాప్ చానెల్ లో పౌరులు చేరవచ్చు. ‘తెలంగాణ సీఎంఓ వాట్సాప్ చానెల్’ ను ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం (సీఎం పీఆర్వో) సమన్వయంతో ఐటీ శాఖకు చెందిన డిజిటల్ మీడియా విభాగం నిర్వహిస్తున్నది.

Next Story