ధాన్యం కొనుగోళ్లపై రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది.

By Srikanth Gundamalla  Published on  3 Oct 2024 7:00 PM IST
ధాన్యం కొనుగోళ్లపై రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సీఎం రేవంత్‌ రెడ్డి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకుకీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. సన్న వడ్లకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ వ్యాప్తంగా 7వేల ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన చోట కొత్త ఐకేపీ సెంటర్లు కూడా పెట్టాలని చెప్పారు. సన్నవడ్ల కొనుగోలుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలాగే... సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. ఐకేపీ సెంటర్లకి సీరియల్ నెంబర్లు ఇవ్వాలి. సన్నవడ్లపై ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలి.

రైతులకు ఇబ్బంది లేకుండరా ధాన్యం కొనుగోళ్లు జరగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధాన్యం కోసం గోనె సంచులు అందుబాటులో ఉండాలని చెప్పారు. ధాన్యం కొనుగోలులో వ్యవసాయ అధికారులు భాగం కావాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధ్యానం వెంటనే తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్లు ప్రతీరోజూ రెండు గంటల పాటు ధాన్యం కొనుగోలుపైన సమీక్ష జరపాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ధాన్యంలో తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసేవారిని సహించవద్దని చెప్పారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Next Story