ఈనెల 28 నుంచి జనవరి 6వ వరకు ప్రజాపాలన కార్యక్రమం: సీఎం రేవంత్
తెలంగాణ సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు.
By Srikanth Gundamalla Published on 24 Dec 2023 8:30 AM GMTఈనెల 28 నుంచి జనవరి 6వ వరకు ప్రజాపాలన కార్యక్రమం: సీఎం రేవంత్
తెలంగాణ సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆయన జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'ప్రజా పాలన' కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించాలన్నారు. గత ప్రభుత్వ పాలనలో లోపాలను సరిదిద్దడంతో పాటు తమ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలుతో పాటు, పాలనా యంత్రాంగాన్ని గ్రామాస్థాయిని తీసుకుని పోయేలా 'ప్రజా పాలన' కార్యక్రమాలపై సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి పేరిట ప్రజాభవన్‌లో ప్రభుత్వం అర్జీలను స్వీకరిస్తోంది. అయితే.. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున జనాలు వస్తున్నారు. అంతేకాదు.. ఎక్కువగా భూ సమస్యలు, రెవెన్యూ, డబుల్‌బెడ్రూం ఇళ్లు, పెన్షన్ల వంటి అంశాలపైనే ఎక్కువ ఫిర్యాదులు ఉన్నాయి. దాంతో.. సమయం వృథా చేయకుండా.. ప్రజలకు ప్రయాణ భారం లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 'ప్రజాపాలన'ను తీసుకొస్తుంది. చిన్నచిన్న సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగానే అధికారులు గ్రామాలకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారు.
కాగా.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరుగు గ్యారెంటీలతో పాటు పలు హామీలు ఇచ్చిన విసం తెలిసిందే. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చింది. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఆ రోజున మరికొన్ని హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.