బీఆర్ఎస్ చచ్చిన పాముతో సమానం: సీఎం రేవంత్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  29 April 2024 1:27 AM GMT
telangana, cm revanth reddy, lok sabha, malkajgiri,

బీఆర్ఎస్ చచ్చిన పాముతో సమానం: సీఎం రేవంత్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. మల్కాజ్‌గిరి కార్నర్‌ మీటింగ్‌లో బీఆర్ఎస్‌ పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్‌ ఇప్పుడు చచ్చిన పాముతో సమానం అంటూ విమర్శించారు. కారు కార్ఖానాకు పోయిందనీ.. ఇక కారు తిరిగి రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కారు కార్ఖానాకు పోయినందుకే కేసీఆర్ బస్సు ఎక్కి యాత్రలు చేస్తున్నారని అన్నారు. అయితే.. బస్సు యాత్రలో భాగంగా కేసీఆర్ అనసవరపు విమర్శలు చేస్తున్నారని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. వంద రోజుల్లోనే తాము ఐదు గ్యారెంటీలను అముల చేశామనీ.. కానీ ఏమీ చేయలేదు అన్నట్లు మాట్లాడటం సరికాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించామన్నారు. రూ.500 కే గ్యాస్‌ సిలిండర్ అందించి సామాన్యులపై భారాన్ని దించామనీ.. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ వారిని ఆదుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అంతేకాకుండా మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేసి చూపించామని చెప్పారు. కొద్దిరోజుల్లోనే ఇన్ని చేసిన ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని సీఎం రేవంత్ హితవు పలికారు. మల్కాజ్‌గిరిలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటల కొత్తవాడు కాదనీ.. కేసీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తే అన్నారు. పంపకాల్లో తేడా వచ్చే ఈటలను కేసీఆర్ బయటకు పంపారని చెప్పారు. మల్కాజ్‌గిరి సమస్యలను ఈటల ఏనాడు పట్టించుకోలేదన్నారు. అలాంటిది ఇప్పుడు ఇచ్చి ఓట్లు ఎలా అడుగుతున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు.

తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్‌లు చీకటి ఒప్పందం చేసుకున్నాయని సీఎం రేవంత్ ఆరోపించారు. వారి ఒప్పందాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే బట్టబయలు చేశారని అన్నారు. మతం ముసుగులో బీజేపీ ఓట్లు అడగటం కాదు.. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలన్నారు. ఈటల చుట్టం లాంటి వారనీ.. వచ్చి వెళ్లడం తప్ప చేసేదేం అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే అది బీఆర్ఎస్‌కు వెసినట్లు అవుతుందని అన్నారు. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో సనీత మహేందర్‌రెడ్డి లక్ష మెజార్టీతో గెలిపించుకుందామనీ.. తద్వారా ఆమె నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడతారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Next Story