Hyderabad: వ్యాపారులకు సీఎం రేవంత్‌రెడ్డి గుడ్‌న్యూస్
హైదరాబాద్ నగరంలో కొద్ది రోజులుగా పోలీసులు కఠిన నిబంధనలు పాటిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 3 Aug 2024 6:37 AM ISTHyderabad: వ్యాపారులకు సీఎం రేవంత్‌రెడ్డి గుడ్‌న్యూస్
హైదరాబాద్ నగరంలో కొద్ది రోజులుగా పోలీసులు కఠిన నిబంధనలు పాటిస్తున్నారు. రాత్రి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు, హోటళ్లు తెరిచి ఉండేలా చూస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. వరుస నేర సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. వ్యాపార కార్యకలాపాలను 11 దాటి నిర్వహించిన వారిపై కేసులు కూడా నమోదు చేశారు. ఎవరైనా రోడ్లపైకి వచ్చి తిరిగితే కఠినంగా వ్యవహరించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల తీరుపై వ్యాపార వర్గాలు, రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వచ్చింది. దాంతో.. శుక్రవారం శాసనసభలో ఇదే విషయంపై చర్చకు వచ్చింది. దాంతో సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. వ్యాపారులకు శుభవార్త చెప్పారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు నగరంలో దుకాణాలు తెరిచే ఉండొచ్చని వ్యాపార వర్గాలకు తీపి కబురు చెప్పారు.
అలాగే ఉస్మానియా కొత్త భవనంపై కూడా కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. గోషామహల్ స్టేడియంలో 30 ఎకరాల్లో కొత్త ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. త్వరలోనే ఆస్పత్రి నిర్మాణ పనులు పట్టాలెక్కకున్నాయని చెబుతన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యశాఖకు చెందిన సంఘాల నేతలు, ఉస్మానియా వైద్యులు సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పురాతన భవనాన్ని కూల్చకుండానే కొత్త ప్రాంతంలో తిరిగి నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.