రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణలో రైతులు రుణమాఫీ అమలు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  16 May 2024 6:50 AM GMT
Telangana, cm revanth reddy, farmer loan,

రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణలో రైతులు రుణమాఫీ అమలు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లు రూ.2లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తుందా అని వెయిట్‌ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు రాష్ట్రంలో ఇప్పటికే జరిగిన విషయం తెలిసిందే. ఈ పోలింగ్ తర్వాత రుణమాఫీ ఉంటుందని పలువురు చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు రుణమాఫీపై స్పందించారు. అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు.

ఆగస్టు 15వ తేదీ లోపు రైతు రుణమాఫీ చేసి తీరాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వీలైనంత త్వరగా రైతు రుణమాఫీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. కాగా.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్ర విమర్శల దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎక్కువగా రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారంటూ నిలదీసింది. దమ్ముంటే రూ.2లక్షల రుణమాఫీ చేయాలని.. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా రైతు రుణమాఫీపై స్పందించింది అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

పోలింగ్ ప్రక్రియ ముగియడంతో సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రైతు రుణమాఫీకి సంబంధించి విధివిధానాలను రూపొందించాలని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందే అన్నారు. అలాగే రాబోయే నాలుగేళ్లలో రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్ సహా ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

Next Story