ఏ పరీక్ష రాయనివారే వాయిదా కోరుతున్నారు: సీఎం రేవంత్‌రెడ్డి

అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  14 July 2024 7:15 AM IST
telangana, cm revanth reddy, comments, jobs,

ఏ పరీక్ష రాయనివారే వాయిదా కోరుతున్నారు: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌లోని జేఎన్టీయూహెచ్​లో ‘తెలంగాణలో క్వాలిటీ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్’ అంశంపై ఇంటరాక్షన్ ప్రోగ్రామ్​తో పాటు ‘స్టూడెంట్​వలంటరీ పోలీసింగ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇక దాని ప్రకారమే ఏటా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. యూపీఎస్సీ తరహాలో ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీలను భర్తీచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి. ప్రతి ఏటా మార్చి 31 కల్లా అన్ని శాఖల్లోని ఖాళీలను తెప్పించి.. జూన్‌ 2 కల్లా నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. అలాగే డిసెంబర్ 9వ నాటికి ఆ సంవత్సరంలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

ఏ పరీక్షా రాయని వారే వాయిదా అడుగుతున్నారు: సీఎం

కొందరు పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. వాయిదా వేయడం ద్వారా ప్రజా ప్రతినిధులకు పోయేది ఏమీ లేదని తెలిపారు. అయితే.. పరీక్ష వాయిదా కోసం ఆందోళన చేస్తున్న వారిలో ఏ పరీక్షా రాయని వారే ఉన్నారని చెప్పారు. ముగ్గురు దీక్ష చేస్తే వారిలో ఒక్క కూడా ఏ పరీక్షా రాయట్లేదని తెలిసిందన్నారు. వాళ్ల వివరాలను కూడా సేకరించినట్లు తెలిపారు సీఎం రేవంత్. ఒక కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ఉంటే.. అతన్ని అడిగామన్నారు. రెండు నెలలు డీఎస్సీ పోస్ట్‌పోన్ చేస్తే రూ.100 కోట్ల లాభం వస్తుందని ఆయన దీక్ష చేస్తున్నట్లు తెలిపాడని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాల కోసం పోరాటం చేశామని గుర్తు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షు నిర్వహిస్తుంటే ఎందుకు వాయిదా వేయాలని కోరుతున్నారంటూ ప్రశ్నించారు. పరీక్షల సిలబస్‌లు మార్చలేదనీ.. పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొన్ని రాజకీయ వక్తులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు స్వలాభం కోసమే పరీక్ష వాయిదా కోసం డిమాండ్ చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రెండేళ్ల క్రితమే డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది.. అప్పటి నుంచి వాయిదా పడుతూనే రాగా.. మళ్లీ వాయిదా కోరుతున్నారని చెప్పారు. రెండేళ్లుగా ప్రిపేర్ అవుతున్న వారి పరిస్థితి ఏంటని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు.

Next Story